లాస్య మోహన నీళ్లు కొట్టిన రాములమ్మ… లాస్య వింత చేష్టలతో షాక్ లో కుటుంబ సభ్యులు!

బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే..దివ్య జరిగిన సంఘటనను గుర్తుచేసుకొని భయపడుతూ ఉండగా తులసి మాత్రం తనకు భోజనం తీసుకెళ్లి భోజనం తిని పెడుతూ తనకు ధైర్యం చెబుతుంది. అలాగే ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలాంటి ఆవేదన చెందుతారో వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో దివ్యకు తెలిసి వచ్చేలా తనకు చెబుతుంది. అనంతరం దివ్యను పడుకోబెట్టి తులసి బయటకు వస్తుంది.

మరుసటి రోజు ఉదయం అందరూ నిద్ర లేచినప్పటికీ లాస్య మాత్రం నిద్రలేవదు అలాగే సెల్ ఫోన్ లో పాటలు పెట్టుకొని నిద్రపోతూ ఉండగా నందు పాటలు ఆఫ్ చేస్తాడు అయితే లాస్య కళ్ళు తెరవకుండా తిరిగి పాటలు ఆన్ చేసుకుని నిద్రపోతూ ఉంటుంది. నిన్ను లేపడం ఎవరివల్ల కాదు అనుకుంటూ వెళ్ళగా అంతలోపు రాములమ్మ అక్కడికి వెళ్లి తనని నిద్ర లేపినప్పటికీ లాస్య మాత్రం నిద్ర లేవదు.దీంతో మిమ్మల్ని ఎలా నిద్రలేపాలో నాకు తెలుసు అంటూ బకెట్ నీళ్ళు తీసుకువచ్చి మొహాన కొడుతుంది.

దీంతో ఒక్కసారిగా బిత్తిరిపోయిన లాస్య వర్షం వర్షం అంటూ నిద్రలేచి అనంతరం అవును నేను తులసి లాగా రెడీ కావాలి కదా అంటూ తులసి లాగా తయారవడానికి వెళ్తుంది. మరోవైపు పరంధామయ్య తులసిని కాఫీ అడగడంతో అంకిత ఇస్తానని చెప్పింది కదా అంటుంది అప్పుడు అంకితం ఇంట్లో కిచెన్ కు తాళాలు వేసి ఉంది అని చెప్పడంతో ఈ లాస్య బుద్ధి ఇంకా మారలేదని తులసి అంటుంది. అయితే అంకిత మాత్రం ఇదివరకు మనం కిచెన్ లో ఏ పని చేసిన తన పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పేది అయితే ఇప్పుడు మాత్రం స్వయంగా అందరికీ చేసి పెడుతుందట అని చెప్పడంతో ఈ ఇంటికి మంచి రోజులు వచ్చాయని తులసి నవ్వుకుంటుంది.

మరోవైపు అచ్చం తులసి లాగా తయారైన లాస్య తన రూమ్ శుభ్రం చేసుకుంటూ ఉండగా నందు గదిలోకి వెళ్లి ఈ ఇంటిని శుభ్రం చేసిన తర్వాత నాకు ఒక కాఫీ తీసుకొచ్చి ఇవ్వు రాములమ్మ అంటాడు. ఇలా రాములమ్మ అనడంతో లాస్య బిత్తర పోతుంది నేను తులసి గెటప్ లో ఉంటే పిలిస్తే గెలిస్తే తులసి లేదా లాస్య అని పిలిచాలి కానీ ఇలా మధ్యలో రాములమ్మ ఎందుకు వచ్చింది అంటూ నందుకు క్లాస్ తీసుకుంటుంది. మరోవైపు లాస్య తులసి వేషంలో పాటలు పాడుతూ అందరికీ కాఫీ తీసుకురావడంతో అందరూ ఆమె గెటప్ చూసి ఒక్కసారిగా హడలిపోతారు. ఇక పరంధామయ్య లాస్య పై వెటకారంగా జోకులు వేస్తూ అందరిని నవ్విస్తారు.