లాస్యను పనిమనిషిని చేసిన భాగ్య… దివ్య విషయంలో తులసితో గొడవపడ్డ నందు!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్నికి వస్తే లాస్య ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవడం కోసం తులసి మాదిరి గెటప్ వేసుకొని ఇంట్లో అందరికీ సేవలు చేస్తూ ఉంటుంది.అయితే తాను చేసే చేష్టలతో అందరూ నవ్వుకుంటారు. మరొకవైపు నందు వచ్చి రాములమ్మ నిన్ను కాఫీ అడిగి ఎంతసేపు అయింది ఇంకా ఇవ్వలేదు అనడంతో లాస్య ఒక్కసారిగా నందు వైపు చూస్తుంది. దీంతో షాక్ అయినా నందు ఈ అవతారం ఏంటి వెనకనుంచి చూసి రాములమ్మ అనుకున్నాను అంటూ చెబుతాడు.ఇక తాను ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవడం కోసం చాలా పనులు చేయాల్సి ఉంటుందని లాస్య బయటకు వెళ్లి ముగ్గు వేస్తూ ఉంటుంది.

లాస్య ముగ్గు వేస్తూ ఉండగా అక్కడికి భాగ్యం వచ్చి పనిమనిషి అనుకుని ఇంట్లో లాస్య ఉందా అని అడగడంతో నేనే లాస్య అని సమాధానం చెబుతుంది ఓహో నీ పేరు కూడా లాస్య నా ఈ ఇంట్లోలాస్య అనే ఓ తింగరిది ఉంది అంటూ మాట్లాడుతూ ఉండగా వెంటనే లాస్య భాగ్య వైపు చూస్తూ నేను తింగరి దాన్నా అంటూ మాట్లాడటంతో వెనుకనుంచి చూసి పనిమనిషి అనుకున్నాను లాస్య అంటూ భాగ్య మాట్లాడుతుంది.తులసక్క లాగా గెటప్ అయితే వేసావు కాని ఇప్పుడు ఈ గెటప్ ఎందుకు వేశావు అని ప్రశ్నించడంతో ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవాలంటే తులసి మాదిరిగా ఉండాలని నందు చెప్పాడు అందుకే ఇలా మారిపోయానని చెబుతుంది.

ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవాలంటే నువ్వు తులసక్కలాగా మారిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీలాగా ఉంటే చాలు అని భాగ్య చెబుతుంది. అంతలోపే తులసి ఇంటికి కొరియర్ వస్తుంది అది చూసిన నందు ఈ ఇంట్లో నా స్థానం ఏంటో తేలిపోవాలి అని ఇంట్లో వారందరిని పిలుస్తారు.తులసి అక్కడికి రావడంతో దివ్య నీ కూతురా నా కూతురా అని ప్రశ్నించడంతో మన కూతురు అని సమాధానం చెబుతుంది.అలాంటప్పుడు దివ్య కు సంబంధించిన విషయాల గురించి ఇద్దరం కలిసి మాట్లాడుకోవాలి కదా నాకు తెలియకుండా తనని ఢిల్లీ యూనివర్సిటీకి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు అని నందు ఫైర్ అవుతాడు.

తనకు యూనివర్సిటీలో సీటు వచ్చిందనే విషయం ఈ లెటర్ చూస్తే తప్ప నాకు తెలియడం లేదు ఈ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు నేను ఉన్నాను అనుకున్నారా లేకపోయాను అనుకున్నారా అంటూ మండిపడతారు.ఎం దివ్య నువ్వు అప్లై చేసేటప్పుడు అయినా ఈ విషయం నాతో చెప్పాలి కదా అని నందు మండిపడటంతో డబ్బు సమస్య కారణంగా నేను చదువు ఆపేద్దాం అనుకున్నాను డాడ్ కానీ అమ్మ సర్దుబాటు చేస్తానంటే అప్లై చేశాను అని దివ్య సమాధానం చెబుతుంది. మొన్న మనందరం ఇక్కడే ఉండి కూడా ది వెను కాపాడుకోలేకపోయాం ఇప్పుడు ఒంటరిగా అంత దూరం ఎలా పంపిస్తాం అంటూ నందు అడ్డుపడుతారు.