అల్లుడు అదుర్స్ … ట్రైలర్ వచ్చేసింది !

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌స్తుతం అల్లుడు అదుర్స్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తున్న ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇస్తా… అదే నా క్యారెక్టరైజేషన్‌ అంటున్నారు యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. శీనుగాడు నా ఫ్రెండ్‌.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో వాడిది సపరేట్‌ ట్రెండ్‌.. ఇక్కడ హ్యాష్‌ ట్యాగ్స్‌ లేవమ్మా.. అంటూ వెన్నెల కిషోర్‌ చెబుతున్న డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సంక్రాంతికి మన ముందుకి రాబోతుంది. కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా కాకుండా ఆస‌క్తిక‌ర క‌థాంశంతో ఈ సినిమా సాగ‌నున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. ఈ చిత్రంలో సోనూసూద్, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్ లో జోష్ నింపుతున్నాయి.

అంతకుముందు చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు’గా ఇద్ద‌రు మ‌ర‌ద‌ళ్ల మ‌ధ్య‌లో వారి చేయిప‌ట్టుకుని నిల్చున్నాడు. బావా మ‌ర‌ద‌ళ్లు చిరున‌వ్వులు చిందిస్తున్న ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ చ‌క్క‌ర్లు కొడుతోంది.

#AlluduAdhurs Trailer | Alludu Adhurs Movie | Bellamkonda Sreenivas | Nabha Natesh | DSP