ఆ కమెడియన్‌కు సమంత ఐ లవ్యూ చెప్పేసింది!!

సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే సమంత తన కెరీర్ ప్రారంభం నుంచి కొంతమందితో చాలా దగ్గరగా ట్రావెల్ అవుతూ ఉంది. అందులో చిన్మయి, రాహుల్, వెన్నెల కిషోర్ ఇలా సమంతకంటూ స్పెషల్ గ్యాంగ్ ఉంటుంది. స్క్రీన్‌పైనే కాదు.. తెర వెనుక కూడా వీరంతా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మొన్ననే (సెప్టెంబర్ 19) వెన్నెల కిషోర్ బర్త్ డే వచ్చింది. వెన్నెల కిషోర్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులంతా విషెస్ తెలిపారు.

Samantha Special Birthday Wishes To Vennela Kishore

మహేష్ బాబు నుంచి అడివి శేష్ వరకు ఇలా ప్రతీ ఒక్క హీరో వెన్నెల కిషోర్ బర్త్ డేకు విష్ చేశారు. కమెడియన్స్, దర్శక నిర్మాతలు హీరోయిన్లు ఇలా సినీ ప్రముఖులంతా వెన్నెల కిషోర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరి విషెస్‌లోకెల్లా మహేష్ బాబు వేసిన ట్వీట్ చూసి వెన్నెల కిషోర్ గాల్లో తేలిపోయాడు. ఎంతో ఆనందంగా ఉందని ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని వెన్నెల కిషోర్ ఎమోషనల్ అయ్యాడు.

ఇక అందరిలోనూ సమంత చెప్పిన విషెస్ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. హ్యాపీ బర్త్ డే మై క్యూటీ పటూటీ వెన్నెల కిషోర్. ఈ క్రమంలో ఐ లవ్యూ అనే చెప్పేసింది. ఇక మన కమెడియన్ కూడా.. లవ్యూ మోర్ అంటూ హగ్గులిస్తున్న ఎమోజీలను షేర్ చేశాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు. సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్, సాకీ వరల్డ్ ఫ్యాషన్ బ్రాండ్‌ దుస్తులను మార్కెట్లోకి తీసుకు వచ్చే పనుల్లో బిజీగా ఉంది.