మహేష్ ‘సర్కారు వారి పాట’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి మహేష్ సరసన మహానటి ఫేం కీర్తి సురేష్ నటించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ తో ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇలా మొదలుపెట్టారో లేదో అప్పుడే విడుదల పై చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చింది.

Image

సంక్రాంతి బరిలో దిగేందుకు పందెంకోడి ఇప్పటి నుంచే సిద్ధమవుతుందంటూ సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మహేశ్‌బాబు హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే సర్కారు వారి పాట. ఈ వారం ప్రారంభంలో సినిమా షూటింగ్‌ మొదలైంది. మహేశ్‌తో మహానటి’ కీర్తి సురేశ్‌ తొలిసారిగా జోడీ కడుతున్నారు. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సక్సెస్‌ల తర్వాత మహేశ్‌ నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం కావడంతో సరిలేరు మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. 14 రీల్స్‌ ప్లస్‌, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే మహేష్ గత చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సంక్రాంతికి సందడి చేయనున్నాడు. కాగా ఈ చిత్రం బ్యాంక్ స్కాములు – ఆర్థిక నేరగాళ్ల కథతో టార్గెట్ ఉంటుందని తెలుస్తోంది.