‘కనక దుర్గ’ టైటిల్ వెనక రవితేజ సెంటిమెంట్

‘రభస’ డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ సినిమా తెరి రీమేక్ గా ఈ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మొదట ఈ కథను పవన్ కళ్యాణ్ కోసం మొత్రీ మూవీస్ వారు చేయించారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లాక,. తరువాత రవితేజతో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు అని కమిట్ అయ్యారు. కానీ కొన్ని సమస్యలుతో ఆగారు.

దాంతో ఇప్పటికే స్క్రిప్ట్ మీద ఖర్చు, డైరక్టర్ ఖర్చు, అడ్వాన్స్, హీరో అడ్వాన్స్ ఇన్నీకలిపి వెనక్కు తెచ్చుకోవడానికి ప్రాజెక్ట్ మీద ముందుకు వెళ్లాలనే డిసైడ్ అయిపోయారు. అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్ కు కనకదుర్గ అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు రవితేజ, వినాయిక్ కాంబినేషన్ లో కృష్ణ అనే సినిమా చేసాడు .ఆ సెంటిమెంట్ తో అదే విజయవాడ బ్యాక్ డ్రాప్ లో కనకదుర్గ టైటిల్ ని ఫిక్స్ చేసారట. ఆ కనకదుర్గ మైత్రీకి కాసులు కురిపిస్తుందని భావిస్తున్నారు.

మరో ప్రక్క ఇమ్మీడియిట్ గా మాస్ రాజా రవితేజ కు ఓ హిట్ పడాలి. వరుస ప్లాప్స్ రవితేజ మార్కెట్ ను పూర్తిగా డౌన్ చేసేసాయి. ఈ నేపధ్యంలో నిర్మాతలెవరు రవితేజ తో సినిమాలు చేసేందుకు ఉత్సాహంగా లేరు. గతంలో అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలే రవితేజతో సినిమాలు తప్పదు అన్నట్లుగా చేసేందుకు వస్తున్నారు.

ప్రస్తుతం డిస్కో రాజా అలా సెట్ అయ్యిన ప్రాజెక్టే. నేల టికెట్ సమయంలోనే నిర్మాత రామ్ తాళ్లూరి రెండు సినిమాలకు రవితేజ కు అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారు. ఇచ్చిన అడ్వాన్స్ తిరిగిరావు కాబట్టి రవితేజ తో సినిమాను మొదలు పెట్టాడు. వి.ఐ. ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే సెట్స్ ఫైకి వచ్చింది. ఇప్పుడు మైత్రీ మూవిస్ దీ అదే పరిస్దితి అని చెప్పుకుంటున్నారు.