లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన మిడ్ రేంజ్ సినిమాల్లో పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ ని అందుకున్న చిత్రం “దసరా”. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా గట్టి హైప్ మధ్య వచ్చి భారీ వసూళ్లు అందుకుంది. ఇక లేటెస్ట్ గా అయితే దీని తర్వాత ఇదే సెగ్మెంట్ లో పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ ని సెట్ చేసుకొని వస్తున్న మరో సినిమానే “ఏజెంట్”.
అఖిల్ అక్కినేని నుంచి ఎప్పటి నుంచో అవైటెడ్ గా ఉన్న సినిమా ఇది. దర్శకుడు సురేందర్ రెడ్డి హాలీవుడ్ లెవెల్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా అయితే దీనిని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏక్షన్ పోస్టర్ లు మరియు వీడియోస్ కి క్రేజీ రెస్పాన్స్ ని తెచ్చుకున్న ఈ సినిమా ఎందుకో పాటల విషయంలో మాత్రం క్లిక్ అవ్వలేకపోయింది.
సినిమా జానర్ కి వస్తున్న పాటలకి సంబంధం లేకపోతుండడంతో ఈ విషయంలో మాత్రం హైప్ తగ్గిపోతుంది అని చెప్పక తప్పదు. నిన్న వచ్చిన మరో పాట ప్రోమో కూడా అంతగా ఎవరికీ ఎక్కలేదు. ఇది వరకు వచ్చిన రెండు పాటలు కూడా అంత చార్ట్ బస్టర్స్ కాలేదు.
దీనితో అయితే అయ్యగారి ఏజెంట్ విషయంలో మాత్రం పాటలు ఏమంత ప్రభావం చూపేలా లేవనే చెప్పి తీరాలి. కాగా సినిమాలో అయితే ఓ ఐటెం సాంగ్ ఉంది మరి దీనితో ఏమన్నా మ్యాజిక్ చేస్తారో చూడాలి. కాగా పనికి రాని పాటలు ఉంటే అవి సినిమా ఫ్లో నే దెబ్బ తీస్తాయి. మరి ఏజెంట్ విషయంలో ఏమవుతుందో..
