“ఏజెంట్” పాన్ ఇండియా రిలీజ్ కి బ్రేక్..డీటెయిల్స్ ఇవే.!

వరుసగా ఇప్పుడు టాలీవుడ్ సినిమా నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. అయితే అనౌన్స్ చేసి పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కి వచ్చిన మొదటి సినిమా “దసరా” నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా అనౌన్స్ చేసిన అన్ని భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది.

కానీ ఈ సినిమా తర్వాత వచ్చిన “విరూపాక్ష” కూడా మొదటి నుంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు కానీ అసలు హిందీలో ఈ సినిమా రిలీజ్ అయ్యిన ఆనవాళ్లు లేవు. ఒక్క హిందీలోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కాలేదు.

ఇక దీని తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన సినిమా “ఏజెంట్”. అఖిల్ అక్కినేని హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ  రెడ్డి అయితే దర్శకత్వం వహిచగా మేకర్స్ సుమారు 80 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ లో అయితే ఇప్పుడు బ్రేక్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

మేకర్స్ ఈ సినిమా హిందీ రిలీజ్ ని అయితే ఆపేశారట. అంతే కాకుండా తమిళ్, కన్నడ లో కూడా రిలీజ్ కావట్లేదు అని తెలుస్తుంది. కేవలం తెలుగు సహా ఈ సినిమాలో మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఉన్నారు కాబట్టి మలయాళంలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారట. దీనితో అయితే ఏజెంట్ పాన్ ఇండియా రిలీజ్ కాస్త కేవలం రెండు భాషల్లో మాత్రం అవుతుందట. హిందీలో ఇప్పుడు రిలీజ్ చేసిన పెద్దగా వసూళ్లు రావట్లేదు కాబట్టి ఈ స్టెప్ తీసుకున్నారని చెప్పొచ్చు.