ఇండస్ట్రీ టాక్ : “ఆదిపురుష్” ట్రైలర్ పై లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా రిలీజ్ కి ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొట్ట మొదటిసారిగా చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్ “ఆదిపురుష్” అనే చెప్పాలి. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం రామాయణం ఆధారంగా మాసివ్ బడ్జెట్ తో విజువల్ ట్రీట్ గా అయితే తెరకెక్కించారు.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా కృతి సనన్ సీతా దేవిగా నటించగా సైఫ్ అలీ ఖాన్ అయితే రావణునిగా నటించాడు. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కోసం గత కొన్ని రోజులు నుంచి సాలిడ్ బజ్ సినీ వర్గాల్లో అయితే వైరల్ గా మారింది. మొదటగా అయితే ఈ సినిమా ట్రైలర్ ఈ మే 5న రిలీజ్ చేస్తారని టాక్ రాగ ఇపుడు మరింత క్లారిటీ దీనిపై వినిపిస్తుంది.

ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ అవైటింగ్ ట్రైలర్ ని చిత్ర బృందం ఈ మే 9న రిలీజ్ చేయబోతున్నారట. అయితే మొదటగా అంతకు ముందే ఒకరోజు అంటే 8న థియేటర్స్ లో అన్ని వెర్షన్స్ లో రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికి అయితే ఈ అవైటెడ్ ట్రైలర్ కి డేట్ ఫిక్స్ అయ్యినట్టే అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి అజయ్ అతుల్ లు సంగీతం అందిస్తుండగా మేకర్స్ మొత్తం 600 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.