ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూస్తూ ఈ మంత్రాన్ని చదివితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైనే!

సాధారణంగా చాలామంది ప్రస్తుత కాలంలో ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకొని కళ్ళు తెరుస్తుంటారు ఇలా ఉదయం లేచినప్పటి నుంచి ఫోన్ పక్కనే ఉండాలి అయితే ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అలాగే మనపై ప్రతికూల ప్రభావం కూడా ఏర్పడుతుంది.అందుకే ఉదయం నిద్ర లేవగానే మన అరచేతులను చూసుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన పైనే ఉంటుందని పండితులు చెబుతున్నారు.

మన వేళ్ళ చివరిలో లక్ష్మీదేవి మధ్యలో సరస్వతి అలాగే క్రింది భాగంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారని భావిస్తారు. అందుకే ఉదయం నిద్ర లేవగానే అరిచేతులను రుద్ది ముందుగా మన వేళ్ళ వైపు చూడాలి.ఇలా కళ్ళు తెరవగానే అరిచేతిని చూడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సరస్వతి దేవిజ్ఞానం వెంకటేశ్వరుడి కృపా మనపై కలుగుతుందని పండితులు చెబుతున్నారు.ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాము అలాగే చేతులను వృద్ధి కళ్ళకు తాకించడం వల్ల మనలోకి ఉష్ణం ప్రవేశించి రోజంతా చాలా చురుగ్గా ఉండడానికి కూడా కారణం అవుతుంది.

ఇలా అరిచేతిని చూసిన వెంటనే ఈ క్రింది చెప్పిన మంత్రాన్ని చదవటం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. క‌రాగ్రే వ‌స‌లే ల‌క్ష్మీ క‌ర‌మ‌ధ్యే స‌రస్వ‌తీ క‌ర‌మూలేతు గోవిందః ప్ర‌భాతే క‌ర‌ద‌ర్శ‌నం.. ఈ మంత్రాన్ని చ‌దువుతూ పైన చెప్పిన విధంగా చేస్తే..లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉంటూ ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారని మీపై ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఏర్పడదని పండితులు చెబుతున్నారు.