ఎల్ఐసి పాలసీతో లోన్ పొందాలనుకునేవారు ఈ రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి..?

సాధారణంగా అత్యవసర సమయాలలో డబ్బు లేనప్పుడు తెలిసిన వ్యక్తుల దగ్గర నుండి అప్పు తీసుకోవడం లేదా బ్యాంకులలో, ఫైనాన్షియల్ సంస్థలలో లోన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా లోన్ తీసుకోవటానికి ఏవైనా విలువైన వస్తువులు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇలా తాకట్టు పెట్టకపోతే లోన్ తీసుకునే అవకాశం ఉండదు. అయితే ఇంటి పత్రాలు, బంగారం వంటి విలువైనవి లేకపోయినా కూడా ఎల్ఐసి పాలసీ ద్వారా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇళ్లు, ఎల్ఐసీ పాలసీలను కొల్లాటరల్‌గా పెట్టుకొని బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. ఎల్ఐసి పాలసీ ద్వారా బ్యాంకులు మాత్రమే కాకుండా ఎల్ఐసి సంస్థ కూడా తన పాలసీదారులకు లోన్ ఇస్తోంది.

 

సాధారణంగా లోన్ తీసుకునేటప్పుడు ఏదైనా తాకట్టు పెట్టి లేదా కొల్లాటరల్‌గా చూపించి లోన్ తీసుకుంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అయితే ఏ ప్రూఫ్ లేకుండా తీసుకుంటే వడ్డీ ఎక్కువ పడుతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా తక్కువ వడ్డీ కి లోన్ పొందే ఆప్షన్స్ ని ఎంచుకోవాలి. మీకు ఎల్ఐసి పాలసీ ఉన్నట్లయితే అత్యవసర సమయంలో ఆ పాలసీ తో మీరు లోన్ తీసుకోవచ్చు. అయితే ఎల్ఐసీ పాలసీలతో లోన్ తీసుకునేవారు కొన్ని నియమాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎల్ఐసి పాలసీ ఉపయోగించి లోన్ తీసుకున్న తర్వాత ఏదైనా ప్రమాదం జరిగి పాలసీదారుడు మరణిస్తే ఆ పాలసీ మొత్తం డబ్బు  నామినీగా ఉన్న వారికి వర్తించదు.

 

ఉదాహరణకు ఒక వ్యక్తి పాలసీని కొల్లాటరల్‌ చూపించి లోన్ తీసుకుంటే… లోన్ మొత్తం తిరిగి చెల్లించకుండానే ఆ వ్యక్తి మరణిస్తే పాలసీ డబ్బులు మొత్తం నామినీకి రావు. వ్యక్తి మరణించిన తరువాత అతన లోన్ ఎంత చెల్లించాలో అంత బ్యాంకు కి ఇస్తారు. ఆ తరువాత మిగిలిన డబ్బు నామినీకి అందజేస్తారు. ఎల్ఐసి పాలసీతో లోన్ తీసుకోవాలనుకునే వారు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ దగ్గర కనుక పాలసీ ఉంటే నేరుగా ఎల్ఐసీ నుంచి లోన్ తీసుకోవచ్చు. పాలసీ సరెండర్ వ్యాల్యూలో 90 శాతం వరకు లోన్ పొందొచ్చు. సరెండర్ వ్యాల్యూ రూ.5,00,000 ఉంటే.. గరిష్టంగా రూ.4,50,000 వరకు లోన్ వస్తుంది.