మహిళలకు ప్రయోజనం చేకూరేలా ప్రముఖ బ్యాంక్ అదిరిపోయే స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మహిళలకు ప్రయోజనం చేకూరేలా సఖీ శక్తి పేరుతో స్కీమ్ ను అమలు చేస్తోంది. మహిళల జీవనోపాధి పెరగాలనే ఆలోచనతో ఈ స్కీమ్ అమలు జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
చిన్న మొత్తంలో రుణాలు పొందాలని భావించే మహిళలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. సులువుగానే లోన్ పొందే అవకాశం ఉండగా ఐడీఎఫ్సీ వెబ్ సైట్ ద్వారా ఈ లోన్ గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంటి నుంచి సొంతంగా వ్యాపారం భావించే వాళ్లకు ఈ లోన్ సులువుగా లభిస్తుందని చెప్పవచ్చు. వ్యాపారం చేయగల ప్రతిభ ఉన్నవాళ్లు ఈ లోన్ పై దృష్టి పెట్టవచ్చు.
వ్యక్తిగత అవసరాలు, ఇంటి అదనపు గది నిర్మాణం కోసం కూడా రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది. తీసుకునే రుణం మొత్తాన్ని బట్టి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. సులభ వాయిదాల ద్వారా ఈ లోన్ ను చెల్లించే అవకాశాలు ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజుకు అదనంగా జీఎస్టీని చెల్లించాలి. 21 శాతం నుంచి 23.5 శాతం వరకు లోన్ పై వడ్డీ రేటు ఉంటుందని చెప్పవచ్చు.
ఈ లోన్ కు ఫెసిలిటేషన్ ఛార్జీలు 1 శాతం నుంచి 2 శాతం వరకు ఉంటాయని చెప్పవచ్చు. ఫెసిలిటేషన్ ఛార్జీలకు అదనంగా జీఎస్టీ చెలించాల్సి ఉంటుంది. లోన్ ను తీసుకునే వారు వడ్డీ రేటు ఎక్కువైనా పరవాలేదు అనుకుంటే మాత్రమే ఈ లోన్ పై దృష్టి పెడితే మంచిది.