కలలో దేవుడు కనిపిస్తే అలా జరుగుతుందా.. దేవుడు కనిపిస్తే ఏమవుతుందంటే?

మనలో చాలామంది దేవుడిని నమ్మడంతో పాటు దేవుడిని ఎంతగానో విశ్వసిస్తారు. దేవుడి తోడు ఉంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరతాయని చాలామంది నమ్ముతారు. అయితే కొంతమందికి కలలో దేవుడు కనిపిస్తూ ఉంటాడు. అయితే కలలో దేవుడు కనిపిస్తే మంచి జరుగుతుందని ఎక్కువమంది నమ్ముతారు. దేవుడు కలలో కనిపిస్తే మన కుటుంబానికి మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి.

దేవుడికి మొక్కుకున్న మొక్కులు తీర్చుకోని పక్షంలో కలలో దేవుడు కనిపించి ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడని గుర్తు పెట్టుకోవాలి. దేవుడు కలలో కనిపించి అదే సమయంలో మన మనస్సులో ఏదైనా ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనకు అనుగుణంగా కెరీర్ పరంగా ముందుకు వెళితే మంచిదని చెప్పవచ్చు. దేవుడు కొన్నిసార్లు మనపై ఉండే కోపం వల్ల కూడా కలలో అయితే కనిపిస్తూ ఉంటాడని చెప్పవచ్చు.

దేవుడిని పూజించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. మనం ఏదైనా విషయంలో నమ్మకం కోల్పోతే దేవుడు కలలో కనిపిస్తే జరగకూడని పనులు కూడా జరుగుతాయి. దేవుడు కలలో కనిపిస్తే మెజారిటీ సందర్భాల్లో పాజిటివ్ గా జరిగే అవకాశాలు ఉంటాయి. దేవుడిని భక్తితో పూజించే వాళ్లకు ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడని భక్తులు చెబుతారు.

అధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటే మనం తప్పు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అధ్యాత్మిక భావన వల్ల అన్ని విధాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. దేవుడిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.