బ్లూ అరటిపండును బ్లూ జావా అరటి అని కూడా అంటారనే సంగతి తెలిసిందే. ఇది సాధారణ పసుపు అరటిపండు లాగానే పోషకాలు కలిగి ఉంటుంది, కానీ కొన్ని ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి, ఉదాహరణకు, ఇది రక్తహీనతను నివారించటానికి సహాయపడుతుంది. బ్లూ అరటిపండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనత సమస్యను దూరం చేయటానికి సహాయపడుతుంది.
బ్లూ అరటిపండులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి, ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. బ్లూ అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అదే సమయంలో మలబద్ధకాన్ని నివారిస్తుంది. బ్లూ అరటిపండులో విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో తోడ్పడతాయని చెప్పవచ్చు.
బ్లూ అరటిపండు తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది, కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. బ్లూ అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఫైబర్ లోపంతో బాధ పడేవాళ్లకు ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. బ్లూ అరటిపండు 105 కేలరీలను కలిగి ఉండే అవకాశం అయితే ఉంటుంది.
శరీరం ఫిట్ గా ఉండేలా చేయడంలో అరటిపండు తోడ్పడుతుందని చెప్పవచ్చు. ఈ బ్లూ అరటిపండు రుచి వెనిలా ఐస్ క్రీమ్ల్ లా ఉంటుందని చెప్పవచ్చు. బ్లూ అరటి పండ్లను ఎక్కువగా తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బ్లూ బనానా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పవచ్చు.