సీజన్ తో సంబంధం లేకుండా డిమాండ్ ఎక్కువగా ఉండే పండ్లలో దానిమ్మ ఒకటని చెప్పవచ్చు. ఫైబర్, విటమిన్లు కె, సి, బి, ఐరన్, పొటాషియం, జింక్, ఒమేగా 6, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు దానిమ్మలో ఎక్కువగా ఉంటాయి. సంవత్సరం పొడవునా దానిమ్మకు డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు. దానిమ్మ సాగు చేయడం ద్వారా రైతులు కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలో దానిమ్మ పండ్ల సాగు ఎక్కువగా జరుగుతుంది. దానిమ్మ చెట్టు దాదాపుగా 25 ఏళ్ల పాటు ఫలాలను అందిస్తుందని చెప్పవచ్చు. దానిమ్మ ఉప-ఉష్ణమండల వాతావరణానికి చెందిన మొక్క కాగా ఈ పండ్లకు పొడి వాతావరణం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. దాదాపు అన్ని రకాల నేలల్లో దానిమ్మను సాగు చేయవచ్చు.
నీటి పారుదల, ఇసుకతో కూడిన నేలలకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. బంజరు భూముల్లో సైతం సహజ ఎరువును వినియోగించి దానిమ్మ సాగు చేయవచ్చు. ఆగస్టు నుంచి సెప్టెంబర్ లేదా ఫిబ్రవరి నుంచి మార్చి దానిమ్మ సాగుకు మంచి కాలమని చెప్పవచ్చు. దానిమ్మకి బిందు సేద్యం ఉత్తమమైనది కాగా రాజస్థాన్ వంటి తక్కువ నీటి ప్రాంతాల్లో దానిమ్మను ఎక్కువగా సాగు చేస్తారు.
దానిమ్మ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సైతం పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజూ ఒక దానిమ్మ పండును తిన్నా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దానిమ్మ పండ్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.