బీటెక్ పాసైన వాళ్లకు అదిరిపోయే శుభవార్త ఇదే.. 1,80,000 వేతనంతో జాబ్స్!

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు చెబుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేలా ఈ సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా రూ.1,80,000 వేతనం లభిస్తుంది. ఆన్‌లైన్ స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుంది. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుకు వయో పరిమితి 35 సంవత్సరాలు కాగా మెడికల్ స్పెషలిస్ట్ పోస్ట్‌కు 42 సంవత్సరాలు వయో పరిమితిగా ఉంది.

జూన్ నెల 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. థర్మల్ లేదా గ్యాస్ పవర్ ప్లాంట్‌లో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలలో కొన్ని ఉద్యోగ ఖాళీలకు అనుభవం కచ్చితంగా ఉండాలి.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభిస్తుండటంతో నిరుద్యోగులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.