మన దేశంలో చాలామంది జాతకంలోని దోషాల వల్ల పెళ్లి విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. జాతకాన్ని జ్యోతిష్కులకు చూపించడం ద్వారా జాతకంలో కుజ దోషం ఉందో లేదో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వాస్తవానికి పురుషులకు కుజ దోషం ఉండదు. వివాహం విషయంలో ఆడవాళ్లకు కుజుడిని మగవాళ్లకు శుక్రుడిని జాతకం ప్రకారం చూడటం జరుగుతుంది.
కుజ దోషం వల్ల జీవిత భాగస్వామి వియోగం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని పండితులు చెబుతున్నారు. కొన్ని రాశులలో జన్మించిన వాళ్లపై కుజ దోష ప్రభావం అయితే ఉండదు. కుజ దోషం ఉన్న వ్యక్తులకు పెళ్లి అవుతుంది కానీ దాంపత్య జీవితంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. దంపతులలో కేవలం ఒకరి జాతకంలోనే కుజుడు ఉంటే చెడు ప్రభావాలు కలిగే ఛాన్స్ ఉంటుంది.
అలా కాకుండా ఇద్దరి జాతకాలలో కుజుడు ఉంటే మాత్రం నెగిటివ్ ఫలితాలు కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గోమాత సమేత ఐశ్వర్యకాళీ అమ్మవారి పాదుకలు ఉన్న పటానికి ప్రతి మంగళవారం రోజున పూజలు చేయడం వల్ల కుజ దోషం తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆంజనేయస్వామి పూజ చేయడం ద్వారా కూడా కుజ దోషం నుంచి బయటపడవచ్చు.
ఎర్రని వస్త్రాలు, భోజనం, బెల్లం, పగడం, గోధుమలు, కందులు, ఎర్రని ఎద్దు, రాగి, బంగారం దానం చేయడం ద్వారా కుజ దోషం తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. సహజంగా ఏర్పడిన పుట్టకు పూజ చేయడంతో పాటు నూతన వధూవరులకు మంచం, మెత్తని పరుపు, దుప్పట్లు దానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయి.