మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయా.. ఈ చిట్కాలతో ఆ సమస్యకు సులువుగా చెక్!

ప్రస్తుత కాలంలో ఎలుకల వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఎలుకల బెడద చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఎలుకలు ఇంట్లో బట్టలను కొరికేయడంతో పాటు ఎలుకలు తిన్న ఆహారం మనం తీసుకోవడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇంటిని శుభ్రంగా, సర్దుకుని మెయింటెన్ చేయని వాళ్ల ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉంటాయి.

కొన్ని సహజమైన చిట్కాలను పాటించడం ద్వారా ఎలుకలను ఇంటి నుంచి తరిమి కొట్టవచ్చు. ఎలుకలకు ఉల్లిపాయల వాసన పడదు. ఎలుకలు తిరిగే చోట చిన్నచిన్న ఉల్లిపాయ ముక్కలను పెట్టడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రెండు రోజులకు ఒకసారి ఉల్లిపాయ ముక్కలను మార్చడం ద్వారా సమస్య నుంచి పరిష్కారం లభిస్తుందని చెప్పవచ్చు.

సన్నగా తరిగిన వెల్లుల్లిని నీళ్ళల్లో కలిపి ఆ వెల్లుల్లి నీళ్లను ఇంటి చుట్టూ చల్లడం ద్వారా కూడా సులువుగా ఎలుకల సమస్య దూరమవుతుంది. పుదీనా నూనె సహాయంతో కూడా ఎలుకల సమస్యను దూరం చేసుకోవచ్చు. ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల వద్ద లవంగాలను ఉంచటం ద్వారా కూడా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఎలుకలు తిరిగే చోట బేకింగ్ సోడాను వేయడం వల్ల ఎలుకలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

పలుచటి వస్త్రంలో కారాన్ని వేసి మూటకట్టి ఎలుకలు తిరిగే చోట కారం పెట్టినా ఎలుకల సమస్యను దూరం చేసుకోవచ్చు. మినుములు, నువ్వుల పొడిలో జిల్లేడు పాలను వేసి ఉండలా చుట్టి పెడితే ఎలుకలు అవి తిని చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఎలుకలు వచ్చే అవకాశం అయితే ఉండదు.