మంగళవారం రోజు అస్సలు చేయకూడని పనులు ఇవే.. ఈ పనులు చేస్తే ఇంత నష్టమా?

మనలో చాలామంది చేసే పనులకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలను పాటిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంగళవారంను కొంతమంది జయవారం అని కూడా పిలుస్తారు. హనుమంతుడికి మంగళవారం ప్రీతిపాత్రమైన రోజు అనే సంగతి తెలిసిందే. మంగళవారంరోజు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది.

మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడని చాలామంది భావిస్తారు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పవచ్చు. లేకపోతే అంగారకుడి చెడు దృష్టి పడే అవకాశాలు ఉంటాయి.. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయని చెప్పవచ్చు. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి.

కొన్ని సందర్భాల్లో ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. మంగళవారం రోజున అప్పు తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయడం వల్ల కూడా చెడు జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అసలు చేయించుకోకూడదు.

మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్ గోర్లు తీసుకోవడం లాంటి పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ పనులు చేస్తే ఆయుశ్షు తగ్గడంతో పాటు శారీరక సమస్యలతో బాధ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. మంగళవారం రోజున కొత్త బూట్లను ధరించడం కూడా మంచిది కాదు.