మనలో చాలామంది సంపాదించిన డబ్బు ఇంట్లో స్థిరంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. అయితే కొంతమంది సంపాదించిన డబ్బుతో మరింత ఎక్కువ మొత్తం సంపాదిస్తుండగా మరి కొందరు మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. కొంతమంది ఎంత కష్టపడినా పక్కవాళ్లకు ఉన్న స్థాయిలో సంపాదన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. మన సంపాదనను ఐదు భాగాలుగా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
మనం సంపాదించే డబ్బులలో కొంత మొత్తాన్ని ధర్మం కోసం, అందుకు సంబంధించిన కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తే మంచిది. అయితే ఇందుకు సంబంధించిన విషయాలను ప్రచారం చేసుకోవడం మాత్రం సరి కాదని గుర్తుంచుకోవచ్చు. మిగిలిన డబ్బులో కొంత మొత్తాన్ని పేదల కోసం, అనాథల కోసం, దేవాలయాల కోసం ఖర్చు చేయవచ్చు. మిగిలిన డబ్బులో కొంత మొత్తం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయాలి.
భవిష్యత్తులో ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడం కోసం ఖర్చు చేయాలి. మిగిలిన డబ్బులో కొంత మొత్తాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేస్తే మంచిదని చెప్పవచ్చు. మిగిలిన డబ్బును కుటుంబం, పిల్లల కోసం ఖర్చు చేయాలి. మన సంపాదనను ఈ విధంగా ఖర్చు చేస్తే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంట్లో లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఉంచడం వల్ల మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
లోహాలు, బంగారంతో తయారు చేసిన వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల కూడా ఆర్థికంగా బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పడమటి దిశలో వాటర్ ట్యాంక్ ను ఉంచడం ద్వారా కూడా మనపై లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది.