ఈ దేవాలయాలకు వెళ్తే సులభంగా శని దోషం దూరం అవుతుందట.. ఎలా అంటే?

మనలో చాలామంది శని దోషం వల్ల బాధ పడుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రజలు శని దేవుడిని భక్తితో పూజించడం ద్వారా శని ప్రభావం మనపై ఉండదని చెప్పవచ్చు. శనివారం రోజున కొన్ని శని దేవాలయాలను దర్శించుకోవడం ద్వారా శని దోషం దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. న్యాయ చర్యలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు శని దేవుడు అని చాలామంది భావిస్తారు.

శని దృష్టి ప్రత్యక్షంగా ఉంటే ధనవంతులుగా మారే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. శని వక్రంగా చూస్తే మాత్రం ఏ పని చేసినా ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతి శనివారం శనిని పూజించడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలను పొందవచ్చు. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా శని దోషం నుంచి సులువుగా బయటపడే అవకాశాలు అయితే ఉంటాయి.

మహారాష్ట్ర రాష్ట్రంలోని శని శింగనాపూర్ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా ఒక్కరోజులో శని దోషాలన్నీ తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ గ్రామంలో నివశించే ప్రజలు ఇళ్లకు తాళాలు కూడా వేసుకోరని కథలుకథలుగా చెప్పుకుంటారు. ఢిల్లీలో ఉన్న శనిధామ్ ఆలయంలో ప్రపంచంలోనే ఎత్తైన శనిదేవుని విగ్రహం ఉంది. ఈ ఆలయంలో మగ భక్తులు ఆవ నూనెను సమర్పిస్తారు.

యూపీలోని కోకిలవ ధామ్ ఆలయంలో ఆవనూనెను నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనం ఇవ్వడంతో ఈ ఆలయాన్ని కోకిలవన అని పిలవడం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్లారు దేవాలయం రెండు నదుల మధ్య ఉన్న ఆలయం కాగా ఈ ఆలయంలో శనితో పాటు శివుడిని పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. కర్ణాటక రాష్ట్రంలో తుమకూరులో ఉన్న శని దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా కూడా శని దోషాలను తొలగించుకోవచ్చు..