ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది మొండి వ్యాధుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. దేవుళ్లను దర్శించుకోవడం ద్వారా మొండివ్యాధులు సులువుగా నయం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అనారోగ్య నివారణ కోసం ఈ ఆలయాలను దర్శించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను పొందే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.
కర్ణాటకలోని తుమకూరులో అరేయూర్ వైద్యనాథేశ్వరాలయం ఉండగా క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్, సర్జరీ వంటి ప్రాణాంతక వ్యాధులను ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు. తమిళనాడులోని మైలదుతురై సమీపంలో ఉన్న వైతీశ్వరన్ దేవాలయం దర్శించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయని చాలామంది భావిస్తారు.
5000 సంవత్సరాల చరిత్ర ఉన్న కేరళలోని ఎట్టుమనూర్ దేవాలయం దర్శించుకోవడం ద్వారా మూర్ఛ, పెప్టిక్ అల్సర్, చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక ఆస్తమా, జీర్ణ వ్యాధులు, కంటి వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. తిరుచ్చి స్మయపురం మరియమ్మన్ దేవాలయం ఆలయంను దర్శించుకుంటే వేర్వేరు వ్యాధులు నయమవుతాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా వెండితో గాయపడిన శరీరs భాగాన్ని దానం చేయడం జరుగుతుంది.
ఉత్తరప్రదేశ్‌లోని జగ్నేవ హనుమాన్ దేవాలయం, తిరుప్పూర్ జిల్లాలో ఉన్న తిరుమురుగన్ పూండి ఆలయం, తిరుచ్చి సమీపంలో ఉన్న ప్రసన్న వేంకటాచలపతి దేవాలయం, ఆగ్రాకు సమీపంలో ఉన్న పాతాళేశ్వరాలయం, తాలిప్రంబు కొండపై ఉన్న కన్హిరంగడ్ వైద్యనాథ్ ఆలయం, చెన్నైకి సమీపంలోని తిరువల్లూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న పెరంబక్కం శివాలయం దర్శించుకోవడం ద్వారా వ్యాధులను నయం చేసుకోవచ్చు.