మనలో చాలామంది పితృ, రాహు దోషాలతో బాధ పడుతూ ఉంటారు. ప్రజలు చనిపోయిన పూర్వీకుల శాంతి కోసం శ్రాద్ధం చేస్తే పూర్వీకుల సంతోషించి ఆశీర్వాచనాలు వారిపై కురిపించడం ద్వారా వారి ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం నెలకొనే అవకాశాలు అయితే ఉంటాయి. పితృ పక్ష సమయంలో కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా దోషాల నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
జాతకంలోని పితృ దోషం గత జన్మలో చేసిన కర్మల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. తల్లీదండ్రుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా కూడా పితృ దోషాలు వస్తాయి. రాహువు అనుగ్రహం లేకపోవడం వల్ల రాహు దోషం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే పితృ దోషం ఉంటుందో ఆ వ్యక్తి పురోగతి సాధించే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
వీళ్లు మానసికంగా కృంగిపోయే అవకాశంతో పాటు ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు నిలిచే అవకాశాలు ఉంటాయి. అమావాస్య రోజున పేదవాడికి ఖీర్ ను తినిపించడం ద్వారా పితృదోషాన్ని తొలగించవచ్చు. రావిచెట్టును నాటడం, దానిని సంరక్షించడం కూడా పితృ దోష ప్రభావాన్ని తగ్గించే అవకాశాలు ఉంటాయి. భగవద్గీత చదవడం వల్ల ఇంట్లోని పూజా స్థలంలో ప్రతిరోజూ సాయంత్రం దీపం పితృ దోషాలు తొలగిపోయే ఛాన్స్ ఉంటుంది.
పితృదోషం గురించి ఏవైనా సందేహాలు ఉంటే పండితులను సంప్రదించడం ద్వారా ఈ దోషాలను తొలగించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పక్షులకు ధాన్యాన్ని ఆహారంగా అందించడం ద్వారా కూడా ఈ దోషాన్ని తొలగించుకోవచ్చు. పక్షులకు నీళ్లు అందించడం ద్వారా కూడా పితృదోషం తొలగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.