డిగ్రీ, డిప్లొమా చదివిన వాళ్లకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో ఇస్రోలో జాబ్స్!

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌(ఇస్రో) గురించి చదువుకున్న వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇస్రో తాజాగా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. కాంట్రాక్ట్ పద్ధతిలో 70 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

 

ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే వాళ్లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ లో సంవత్సరం పాటు ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 17 ఉండగా టెక్నికల్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 30, డిప్లొమా ఇన్ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్ ఉద్యోగ ఖాళీలు 23 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలను బట్టి అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉండనున్నాయి.

 

మెరిట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. బీఈ, బీటెక్ లో కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఉమాంగ్ అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు లెటెస్ట్ అప్‌డేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

 

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లకు నెలకు 9000 రూపాయలు లభించనుండగా వీటికి ఎంపికైన వాళ్లు స్టైఫండ్ తో పాటు అనుభవం పొందవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.