హైదరాబాద్ పోలీస్ అకాడమీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉండనుందని సమాచారం అందుతోంది. 2024 సంవత్సరం మార్చి 31వ తేదీ ఈ జాబ్ లో పని చేయాల్సి ఉంటుంది.
https://www.svpnpa.gov.in/index.php/vacancies/2224-notice-inviting-applications-for-filling-two-posts-of-data-entry-operators-and-one-post-of-junior-projectionist-purely-on-outsourcing-basis లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్ పాస్ కావడంతో పాటు నిమిషానికి 40 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.
ఈ ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా ఎంపికైన వాళ్లకు రూ.48,207 చెల్లించడం జరుగుతుంది. 64 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. జూనియర్ ప్రొజెక్షనిస్ట్ జాబ్ ఒకటి మాత్రమే ఉండగా ఐటీఐ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వాళ్లకు 35,000 రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. సంస్థ హైదరాబాద్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.