స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 14,582 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యొగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. డిగ్రీ అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనం కలగనుంది.
జూన్ నెల 9వ తేదీ నుంచి జులై నెల 4వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్ కమ్ ట్యాక్స్ ఇన్స్ పెక్టర్, ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్టులు, ఇన్స్పెక్టర్, సెక్షన్ హెడ్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్2, ఆఫీసర్ సూపరిండెంట్, అడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, స్టోరింగ్ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్ లు, ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.
25,500 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. https://ssc.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై నెల 4వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.