ఎంఈసీఎల్ లో 108 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలు.. ఒకింత భారీ వేతనంతో?

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన మినీరత్న1 హోదా కలిగిన ఎంఈసీఎల్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. దేశంలో ఉన్న ప్రాజెక్ట్ కార్యాలయాలలో పని చేయడానికి అనుభవం ఉన్న అభ్యర్థులను నియమించడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అకౌటెంట్, హిందీ ట్రాన్స్ లెటర్, టెక్నీషియన్ సర్వే, డ్రాఫ్ట్ మాన్, టెక్నీషియన్ సాంప్లింగ్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలతో పాటు అసిస్టెంట్ మెటీరియల్స్, అసిస్టెంట్ అకౌంట్స్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లిష్, హిందీ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, డ్రిల్లింగ్ టెక్నీషియన్, మెకానిక్, మెకానిక్ కామ్ ఆపరేటర్, జూనియర్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 108 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటికికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ, సీఏ, టెన్త్, ఐటిఐ, బీఎస్సీ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఈ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి 30 సంవత్సరాలుగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకు 19600 రూపాయల నుండి 55,900 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.mecl.co.in/> వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేపటి నుండి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

2025 సంవత్సరం జులై నెల 5వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేడాగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు ఇతర అభ్యర్థులు మాత్రం 500 రూపాయాలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాత పరీక్ష మార్కుల ఆధారంగా తుది మెరిట్ లిస్ట్ సిద్దమవుతుంది.