అణుశక్తి సంస్థలో భారీ వేతనంతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు.. పదో తరగతి అర్హతతో?

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ దరఖాస్తులను కోరుతోంది. స్టైపెండరీ ట్రైనీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ 11 ఉద్యోగ ఖాళీలు, స్టైఫెండరీ ట్రైనీస్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 166, అసిస్టెంట్ గ్రేడ్1 ఉద్యోగ ఖాళీలు 20 ఉన్నాయి. మొత్తం 197 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

వేర్వేరు విభాగాలకు సంబంధించి ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కెమికల్, మెకానికల్, డీజిల్ మెకానిక్, ఏసీ మెకానిక్, మెషినిస్ట్, వెల్డర్, ఫిజిక్స్, సివిల్ కెమిస్ట్రీ, ఇన్ స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, డిప్లొమా, బీఎస్సీ, ఇంటర్ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 21,700 రూపాయల నుంచి 35,400 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆన్ లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.

సైంటిఫిక్ అసిస్టెంట్ దరఖాస్తు ఫీజు 150 రూపాయలుగా ఉండగా ఇతర ఉద్యోగ ఖాళీలకు 100 రూపాయలకు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ నెల 17వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.