ఎన్టీపీసీ లిమిటెడ్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. ఏకంగా 1,80,000 రూపాయల వేతనంతో?

ఎన్టీపీసీ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. మెకానికల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ నెల 11వ తేదీ నుంచి జూన్ నెల 25 వరకు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

అసిస్టెంట్ ఇంజనీర్ ఆపరేషన్ 1, అసిస్టెంట్ కెమిస్ట్ 1, అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషన్/మెయింటెనెన్స్ 6, అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ 9 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 17 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలుగా ఉంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 50 వేల రూపాయల నుండి 1,80,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

మెకానికల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ విభాగాల్లో అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది. తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. ఎన్టీపీసీ లిమిటెడ్ ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.