ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆన్లైన్ నేరాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్పామ్ కాల్స్, స్పామ్ మెయిల్స్ సమస్య కూడా పెరుగుతోంది. వీటి వల్ల అనేకమంది మోసపోతున్నారు. అయితే ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ రాకుండా అన్నోన్ నంబర్ బ్లాక్ చేసే అవకాశం ఉంది. అయితే స్పామ్ మెయిల్స్ ని అరికట్టడానికి ఏం చేయాలో తెలియక చాలామంది ఇబ్బందిపడుతంటారు
అయితే కొన్ని టిప్స్ తో వీటికి చెక్ పెట్టెయ్యొచ్చు. అవేమిటో తెలుసుకుందాం.
ప్రతిరోజు మొబైల్ కి ఎన్నో స్పామ్ మెయిల్స్ వస్తుంటాయి. అయితే ప్రతిరోజు ఇలా వాటిని గుర్తించి డిలీట్ చేయడం చాలా కష్టం. ఓపిక లేక అలాగే వదిలినా కూడా ఎప్పుడైనా మెయిల్ ఓపెన్ చేసినప్పుడు అనుకోకుండా క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. అందువల్ల స్పామ్ మెయిల్ ను గుర్తించి వాటిని బ్లాక్ చేయాలి. ఇలా చేయటం వల్ల మనకు ఎటువంటి స్పామ్ మెయిల్స్ రావు. స్పామ్ మెయిల్స్ బ్లాక్ చేయానికి మీ స్మార్ట్ ఫోన్ లో డీఎన్డీ ( DND) యాక్టివేట్ చేయాలి. దీని సహాయంతో వచ్చిన మెయిల్ ను గుర్తించి బ్లాక్ చేయవచ్చు. లేదా అన్ సబ్ స్క్రైబ్, ఫిల్టర్ చేయవచ్చు. అలాగే అన్ని మెయిల్స్ ని కలిపి ఒకేసారి బల్క్ గా డిలీట్ చేయవచ్చు.
• మొదటగా జీ మెయిల్ లో బ్లాక్ చేయాలనుకుంటున్న స్పామ్ మెయిల్ పై క్లిక్ చేసి, మెయిల్ టాప్ లో కుడివైపు ఉన్న మోర్ బటన్ పై ప్రెస్ చేయాలి.
• అప్పుడు కొన్ని ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. అందులో బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే భవిష్యత్తులో సెండర్ నుండి ఎటువంటి మెయిల్స్ రావు. ఒకవేళ వచ్చిన నేరుగా స్పామ్ ఫోల్డర్ లోకి వెళ్లి పోతాయి.
• ఒకవేళ స్పామ్ మెయిల్స్ అన్ సబ్ స్క్రైబ్ చేయాలంటే సెండర్ పంపిన మెయిల్ సెలెక్ట్ చేస్తే, సెండర్ పేరు పక్కన చేంజ్ ప్రిఫరెన్సెస్ లేదా అన్ సబ్ స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆ సెండర్ మెసేజ్లను బ్లాక్ చేయవచ్చు.
• జీ మెయిల్ లోని ఇన్బాక్స్ సెక్షన్ లో ఎడమవైపు టాప్ లో కిందికి సూచిస్తున్న బాణం గుర్తుపై క్లిక్ చేసి అన్ని మెసేజ్ లను సెలెక్ట్ చేసుకుని, డిలీట్ బటన్ పై క్లిక్ చేస్తే ఒకేసారి అన్ని మెసేజ్ లు డెలీట్ అవుతాయి.
• ఈ సింపుల్ టిప్స్ తో స్పామ్ మెయిల్స్ నుండి విముక్తి పొందవచ్చు.