భర్త పొరపాటున కూడా భార్యకు చెప్పకూడని విషయాలు ఏంటో తెలుసా?

భార్యాభర్తల వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలు తప్పకుండా దాచాలని ఆచార్య చాణిక్యడు నీతి గ్రంధం ద్వారా తెలియజేశారు.ఇలా భర్త భార్య దగ్గర కొన్ని విషయాలు దాచినప్పుడే వారి సంసార జీవితం చాలా సంతోషంగా నడుస్తుంది లేదంటే ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంటారని చాణిక్యుడు తెలిపారు. మరి చాణిక్య నీతి శాస్త్రం ప్రకారం భర్త భార్య దగ్గర దాచి పెట్టాల్సిన విషయాలు ఏంటి ఏ విషయాలను భార్యకు చెప్పకూడదు అనే విషయానికి వస్తే.

భార్య భర్తల బంధం సంతోషంగా ఉండాలంటే భర్త ఎప్పుడు కూడా తాను ఎంత సంపాదిస్తున్నాను అనే విషయాన్ని భార్యకు చెప్పకూడదు. ఇలా సంపాదన భార్యకు తెలియకపోవడమే మంచిది అదే విధంగా భర్త బలహీనత భార్యకు చెప్పకూడదు తన బలహీనత భార్యకు తెలిస్తే పదేపదే తన బలహీనత గురించి ప్రస్తావించడం అనంతరం ఇద్దరి మధ్య గొడవలు రావడం జరుగుతుందని ఆచార్య చానిక్యుడు తెలియజేశారు.

భర్త బయట ఎవరి దగ్గరైనా అవమానం పాలైన లేదా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అవమానకరమైన సంఘటనలను ఎదుర్కొన్న ఆ విషయాలను పొరపాటున కూడా భార్య దగ్గర చెప్పకూడదు.ఆ విషయం కనుక భార్యకు చెబితే మాటిమాటికి అదే విషయాన్ని గుర్తు చేస్తూ భర్తను చులకన భావనగా చూస్తుంది. ఇక భర్త ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే అది భార్యకుతెలియకుండా సహాయం చేయాలని ఒకవేళ తెలిస్తే మీరు చేసే సహాయానికి భార్య అడ్డుకుంటుందని చాణిక్యుడు తెలిపారు. అందుకే ఈ విషయాలు భర్త ఎప్పుడూ కూడా భార్య దగ్గర ప్రస్తావించకూడదు. ఇలా ప్రస్తావించనప్పుడే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.