డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. విడుదలై 15 రోజులు దాటుతున్నా ఇంకా కలెక్షన్ సునామి ఎక్కడా తగ్గడం లేదు. రికార్డ్స్ కొల్లగొడుతూ అత్యంత సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందులో డాన్సులు కూడా అంతే పెద్ద హిట్ అయ్యాయి. పుష్ప టూ టైటిల్ సాంగ్, జాతర పాటలు అయితే ట్రెండింగ్ లో నిలిచాయి.
ఈ నేపథ్యంలో ఆ పాటల కొరియోగ్రాఫర్ మాస్టర్ విజయ్ పోలాకి మాట్లాడుతూ ఈ పాటలకి దక్కుతున్న ఆదరణ చూసి భావోద్వేగానికి గురయ్యాను అంటూ తన డాన్స్ కెరియర్ గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు విజయ్. తను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని కేవలం పాట కోసమే ఇంద్ర సినిమా 22 సార్లు చూశానని చెప్పాడు. డాన్సర్ గా ఉన్నప్పటినుంచే కొరియోగ్రాఫర్ అవకాశాల కోసం తిరిగానని కొబ్బరి మట్ట సినిమా కోసం మొదటిసారి కొరియోగ్రఫీ చేశానని చెప్పాడు విజయ్.
పుష్ప టు కోసం సుకుమార్ దగ్గరికి నుంచి కాల్ వస్తుందని నేను ఊహించలేదు. సుకుమార్ గారు జాతర సాంగ్ వినిపించారు నేను ఫుల్ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన తర్వాత అదిరిపోయింది మాస్టర్ ఇలానే వెళ్దాం అంటూ నాకు సినిమాలో అవకాశం ఇచ్చారు. క్యారెక్టర్ నుంచి లీడ్ కోసం దాదాపు 8 సార్లు పుష్ప సినిమా చూశాను టీ మూమెంట్ చూసిన తర్వాత బన్నీ గారు అదిరిపోయింది కానీ చెప్పారు. ఈ సాంగ్ కి మూడు నెలలు ప్రిపేర్ అయ్యి 20 రోజులు షూట్ చేసాం.
సినిమా చూసిన తర్వాత అందరూ జాతర సాంగు గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది బన్నీ గారు అద్భుతమైన పర్ఫార్మర్ మేము 90% చెప్తే బన్నీ గారు వందకు వందశాతం ఇచ్చారు అని చెప్పాడు విజయ్. ఇప్పటివరకు తన కెరియర్ చాలా సంతృప్తినిచ్చిందని చెప్పిన విజయ్ రామ్ పోతినేని వల్లే మాస్టరా అవ్వాలనే ఆలోచన వచ్చిందని ప్రస్తుతం తాను సంబరాలు ఏటిగట్టు సినిమాకి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న భైరవం సినిమాకి మ్యాడ్ టు సినిమాకి రామ్ పోతినేని సినిమాకి కొరియోగ్రఫీ చేస్తున్నట్లు చెప్పాడు.