సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన పట్ల అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. విలేకరుల సమావేశం ఏర్పరిచి సంఘటన జరిగిన రోజు విషయాలు గురించి చెప్పాడు. అలాగే తనపై బురద జల్లుతూ నేషనల్ వైట్ గా అవమానిస్తున్నారని తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పాడు. తన క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు ఈరోజు తన క్యారెక్టర్ని కించపరిచారని తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తారని ఊహించలేదని అన్నాడు అల్లు అర్జున్.
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన పూర్తిగా ఒక యాక్సిడెంట్ అందులో ఎవరి తప్పులేదు. కానీ అనుకోకుండా జరిగిన ఆ ఘటనకి నేను చాలా బాధపడుతున్నాను . థియేటర్ కి వచ్చిన వాళ్లకి ఎంటర్టైన్ చేయడానికి నేను అక్కడికి వెళ్లాను నా దృష్టిలో థియేటర్ అనేది ఒక గుడి అలాంటిది అక్కడ అలాంటి ఒక సంఘటన జరిగితే నాకంటే బాధపడే వాడు ఉంటాడా ఇతర హీరోల అభిమానులు చనిపోతేనే వారి ఇంటికి వెళ్లి పలకరిస్తాను అలాంటిదే నా అభిమాని చనిపోతే నేను వెళ్లకుండా ఉంటానా..కానీ పరిస్థితుల ప్రభావం వలన వెళ్ళటం లేదు.
ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినా కూడా ఆ బాబుని వెళ్లి పరామర్శించడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పాడు అల్లు అర్జున్ నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు కానీ నాకు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ బయటకి వచ్చింది. నా సినిమా చాలా పెద్ద సక్సెస్ అయి ఉండి కూడా నేను నా సెలబ్రేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని బాధపడుతుంటే నాతో ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా బాధగా ఉంది.
నా మూడేళ్ల కష్టాన్ని థియేటర్లో చూడాలనుకున్నాను, అయినా 20 సంవత్సరాలుగా అదే థియేటర్ కి వెళ్తున్నాను ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఈ ఆరోజు కూడా నేను వెళ్లేటప్పటికీ పోలీసుల దారి క్లియర్ చేశారు అది చూసి నేను పర్మిషన్ ఉంది కాబట్టే దారిస్తున్నారని ముందుకు వెళ్లాను. నిజానికి ఆరోజు అక్కడ ఒక అభిమాని చనిపోయిందనే విషయం మరుసటి రోజు వరకు నాకు తెలియదు అంటూ ఎమోషనల్ అయ్యారు బన్నీ.