పొరపాటున కూడా భర్త పిల్లల ముందు భార్యతో ఇలా ప్రవర్తించకూడదు!

ఆచార చాణిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా ఒక మనిషి మానవత విలువలతో ఎలా బ్రతకాలో తెలియజేశారు. తన నీతి గ్రంధంలో ఒక మనిషి ఎదుగుదలకు ఎలా కృషి చేయాలి ఒక మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి ఎలా ఉంటే మనిషి తన జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు అనే విషయాల గురించి చాణిక్యుడు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. ఇకపోతే చాణిక్యరు తన నీతి గ్రంధంలో ఒక భర్త తన పిల్లల ముందు భార్యతో ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించకూడదు అనే విషయాలను కూడా స్పష్టంగా తెలియజేశారు.

భర్త పిల్లల ముందు తన భార్య పట్ల ఎప్పుడూ కూడా సరైన మార్గంలో ప్రయాణించాలి లేదా మీరు వ్యవహరించే తీరు మీ పిల్లలపై ప్రభావం చూపి భవిష్యత్తులో వారు కూడా అలాగే ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి కనుక భర్త పిల్లల ముందు కొన్ని పనులను అస్సలు చేయకూడదట. భార్య పిల్లల ముందు మాట్లాడకూడని చేయకూడని, పనులు ఏంటో చాణక్యుడు తన గ్రంథంలో చెప్పుకొచ్చాడు. చిన్నపిల్లల మార్గ నిర్దేశకులు తల్లిదండ్రులే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల ముందు ఎంతో హుందాతనంగా ప్రవర్తించాలి. అలాకాకుండా పిల్లలు భార్య ముందు మీరు అసభ్య పదజాలం వాడుతూ,చేయకూడని పనులు చేస్తూ ఉంటే భవిష్యత్తులో వారు మిమ్మల్ని అనుసరిస్తారు.

చాణిక్య నీతి ప్రకారం మీరు మీ పిల్లల ముందు మీ భార్యను అసభ్యంగా తిట్టడం, కొట్టడం గట్టి గట్టిగా అరవడం వంటివి చేస్తే పసి హృదయాలు కలత చెంది
పిల్లలలో వున్న ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది పైగా ఇంట్లో గొడవలు పెరిగి మనస్పర్ధలు ఏర్పడతాయి. అందుకే పిల్లల ముందు ఎప్పుడూ కూడా మీ భార్యను అరవడం తిట్టడం కొట్టడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు కూడా ఇలాగే తయారయ్యే పరిస్థితులు ఉంటాయి కనుక పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని చాణిక్యుడు తెలియజేశారు.