మీరు మరణించినట్టు వచ్చిన కలని ఇతరులతో పంచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

సాధారణంగా నిద్రపోతున్న సమయంలో అందరికీ కలలు వస్తూ ఉంటాయి. ఈ కళలలో కొన్ని మంచి కలలు , మరికొన్ని పీడకలలో ఉంటాయి. సాధారణంగా ఒక విషయం గురించి లేదా వ్యక్తుల గురించి మనం ఎక్కువగా ఆలోచించినప్పుడు వాటికి సంబంధించిన కలలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని సందర్భాలలో మనకి ఎటువంటి అవగాహన లేని విషయాల గురించి కలలు వస్తుంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే ప్రతి కలకి ఒక కారణం ఉంటుంది. మన భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి కూడా సంకేతంగా కలలు వస్తూ ఉంటాయి. అయితే మనకి వచ్చిన కళల గురించి ఇతరులతో చెబుతూ ఉంటాము. కానీ కొన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల నష్టపోవలసి వస్తుంది. ఎటువంటి కలలు ఇతరులతో పంచుకోకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సొంత మరణం: కొన్ని సందర్భాలలో మనం చనిపోయినట్లు మనకి కలలు వస్తుంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలా మరణం గురించి కల రావటం శుభప్రదంగా భావిస్తారు. ఇటువంటి కలల గురించి ఎవరితోనూ పంచుకోకూడదు. అప్పుడు మాత్రమే దాని ప్రయోజనం చేకూరుతుంది. మీరు మరణించినట్లు వచ్చే కల మీ భవిష్యత్తులో రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ కల గురించి ఎవరికైనా చెబితే వచ్చే ఆనందం దూరమవుతుంది.

వెండి కలశం: కొన్ని సందర్భాలలో మనకి కలలో దేవుళ్ళు, పూజలు కనిపిస్తూ ఉంటాయి.అలాగే కలలో వెండి కలశం కనిపించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి కల రావడం లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉందని తెలిపే సంకేతం. అందువల్ల ఇటువంటి కలల గురించి ఇతరులతో పంచుకోకూడదు.

భగవంతుని దర్శనం: సాధారణంగా అప్పుడప్పుడు దైవదర్శనం చేసుకున్నట్లు కలలు వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి కలలో దేవుడిని చూస్తే, ఉద్యోగ సంబంధిత సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని సంకేతం. ఇంకా ఉద్యోగానికి సంబంధించి ఏదైనా శుభవార్త అందుకోవచ్చు. ఇక అలాంటి కలలను ఇతరులతో పంచుకోకుండా రహస్యంగా ఉంచాలి.

నాగుపాము : అప్పుడప్పుడు కలలో నాకు పాము కనిపిస్తూ ఉంటుంది. ఇలా కనిపించడం శుభప్రదంగా భావించవచ్చు. నాగుపాము కలలో కనిపించటం అనేది మన భవిష్యత్తులో జరగబోయే మంచి గురించి తెలిపే సంకేతం. అందువల్ల ఈ కల గురించి ఎవరితోనూ చర్చించకూడదు.