ట్విట్టర్ టాక్ : విక్రమ్ “కోబ్రా” కి ఊహించని రెస్పాన్స్..!

మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఆడియెన్స్ అభిమానించే విధంగా సినిమాని మరొకరు అభిమానించలేరని చెప్పడంలో సందేహం లేదు.  ముఖ్యంగా మన  ఆడియెన్స్ అయితే ఏ ఇండస్ట్రీ లో కూడా ఇవ్వని ఆదరణను అందిస్తారు. మరి ఇప్పుడు అయితే తమిళ్ నుంచి ఓ సినిమా రిలీజ్ అయ్యింది.

అదే “కోబ్రా”. నటన కోసం ఎంతవరకు అయినా వెళ్లగలిగే స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. మరి అలాగే ఈ సినిమాని డిమాంటి కాలనీ దర్శకుడు అజయ్ జ్ఞ్యాన ముత్తు అయితే ఈ సినిమాని తెరకెక్కించాడు.

ఇర్ఫాన్ పఠాన్ విలన్ గా నటించాడు. అయితే ఈ సినిమాపై ట్విట్టర్ రివ్యూ అని కాదు కానీ ట్విట్టర్ నుంచి మాత్రం చూసిన ఆడియెన్స్ మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ అందిస్తున్నారు. సినిమా రన్ టైం పెద్దదే అయినా కూడా బాగానే ఉందని ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ కోసం చెప్పకుండా ఉండలేకపోతున్నారు.

ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఊహించని లెవెల్లో అదిరిపోయిందని అంటున్నారు. అలాగే సినిమాలో మాథ్స్ కి సంబంధించి సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని అంటున్నారు. ఇంకా విక్రమ్ తన గెటప్స్ తో అదరగొట్టాడని అంటున్నారు. ఓవరాల్ గా అయితే సినిమాపై ప్రస్తుతం మరీ అంత నెగిటివ్ టాక్ ఎక్కడా వినిపించడం లేదు మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.