కేజీఎఫ్ భామని భరించడం అంత కష్టమా.?

రెండు సెన్సేషనల్ హిట్ సినిమాల్లో నటించింది కన్నడ భామ శ్రీనిధి శెట్టి. మామూలుగా అయితే, ఆమెను టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ కూడా ఎగరేసుకుపోవాలి. ‘కేజీఎఫ్’ సిరీస్‌లో రెండు సినిమాలూ అంత గొప్ప విజయాలు సాధించాయ్ మరి.

కానీ, ఈ కన్నడ కస్తూరి మీద తెలుగు సినీ పరిశ్రమ అంతగా ఫోకస్ పెట్టలేదు. తమిళంలో ‘కోబ్రా’ అనే సినిమాలో ఆమె నటించిందిగానీ, ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఒక్క సినిమా ఫట్టయితే మాత్రం, ఆమెను అంత లైట్ తీసుకోవాలా.?

విషయమేంటంటే, టాలీవుడ్ నుంచి శ్రీనిధి శెట్టి వద్దకు ఓ మంచి ఆఫర్‌తో ఓ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కూడా వెళ్ళారట. టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరోతో సినిమా కోసం ఆమెని ఇటీవల సంప్రదించారట.

కానీ, శ్రీనిధి శెట్టి అడిగిన రెమ్యునరేషన్ దెబ్బకి ఆ నిర్మాత, దర్శకుడు షాక్ అయ్యారట. ‘ఆమెని భరించడం కష్టం. రెమ్యునరేషన్ ఒక్కటే కాదు, ఆమె గొంతెమ్మ కోర్కెలు తీర్చడమూ కష్టమే..’ అంటున్నారట సదరు నిర్మాత, దర్శకుడు. ఆ సినిమాలో నటించనున్న హీరో మాత్రం, ఆమెను ఎలాగైనా టాలీవుడ్‌కి పరిచయం చేయాలనే ఆలోచనతోనే వున్నాడట.