మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి ఎన్నో సంప్రదాయాలను ప్రజలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత తొమ్మిది నెలలు, 11 నెలలు లేదా మూడు సంవత్సరాలకు పుట్టు వెంట్రుకలు తీస్తారు. మరికొంతమంది పిల్లలు పుట్టిన ఐదు సంవత్సరాలు తర్వాత కూడా పుట్టు వెంట్రుకలు తీపిస్తారు. అయితే ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న సంప్రదాయం అయినప్పటికి చిన్న పిల్లలకు పుట్టెంటుకలు తీయడంలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 9 నెలల పాటు పిల్లలు తల్లి గర్భంలో ఉన్న ఉమ్మీ నీటిలోనే పెరుగుతారు. దీంతో ఉమ్మీ నీటిలో ఉన్న బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు పిల్లల శరీరంలో, తల భాగంలో కూడా ఉంటాయి.
పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని నెలలకు చర్మం పొరలుగా ఉడిపోయి కొత్త చర్మం వస్తుంది. దీంతో చర్మం మీద ఉన్న సూక్ష్మ క్రిములు తొలగిపోతాయి. అయితే తల భాగంలో మాత్రం అలా జరగదు. దీంతో చిన్న పిల్లలు తరచూ అనారోగ్యానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పిల్లలు పుట్టిన తర్వాత 9 నెలలకు లేదా 11 నెలలకు పుట్టు వెంట్రుకలు తీయించడం అనాదిగా వస్తుంది. అయితే ఇది ఎందుకు ఒక సంవత్సరం ముగిసిన తర్వాతనే చేస్తారంటే బిడ్డ పుట్టిన కొన్ని నెలల వరకు తలభాగం చాలా మెత్తగా సున్నితంగా ఉంటుంది. తల భాగం గట్టిపడటానికి సంవత్సర కాలం పడుతుంది. అందువల్ల దాదాపు పిల్లలందరికీ కూడా 11 నెలలు లేదా మూడు సంవత్సరాల లో తీస్తారు. పిల్లలకు గుండు చేయించడం వల్ల నెత్తిపై సూర్యరష్మి పడటంతో పిల్లల ఎదుగుదల వేగంగా ఉంటుంది.