వివాహ సమయంలో కన్యాదాన ఆచారానికి గల అసలు అర్థం ఏమిటో తెలుసా..?

మన హిందూ సంప్రదాయంలో వివాహ కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత ఉంది. భారతీయ వివాహ సాంప్రదాయాన్ని పాశ్చాత్య దేశస్థులు కూడా పాటిస్తున్నారంటే మన వివాహ సాంప్రదాయం గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. హిందూ వివాహా సాంప్రదాయంలో జయమాల నుండి కన్యాదానం వరకు ప్రతి ఆచారానికి ఒక అర్థం ఉంటుంది. పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత వధువుని వరుడికి అప్పగించడాన్ని కన్యాదానం అంటారు. ఈ కర్మ ద్వారా తండ్రి తన కుమార్తె బాధ్యతను ఆమె భర్తకు అప్పగించి, ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశీర్వదిస్తాడు.

అయితే కన్యాదానానికి మరొక అర్థం కూడా ఉంది. భోపాల్ జ్యోతిష్కుడు మరియు వాస్తు సలహాదారు పండిట్ హితేంద్ర కుమార్ శర్మ ఈ విషయంపై మరింత సమాచారం అందించారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు కన్యాదానం గురించి వివరించాడు. అర్జునుడు మరియు సుభద్రల గంధర్వ వివాహాన్ని శ్రీకృష్ణుడు జరిపించాడు. అయితే బలరాముడు ఆ వివాహాన్ని వ్యతిరేకిస్తూ… సుభద్రకు కన్యాదానం జరగలేదని కన్యాదానం చేసేంత వరకు ఈ వివాహం సంపూర్ణంగా పరిగణించబడదని చెప్పాడు. కన్యా దానానికి సరైన అర్థం ఆడపిల్లల మార్పిడి, ఆడపిల్లల దానం కాదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

వివాహ సమయంలో వధువు తండ్రి ఆమె చేతిని వరుడి చేతిలో పెట్టు ఇచ్చిపుచ్చుకుంటు… ఇప్పటి వరకు నా కూతురిని పోషించి ఆమె బాధ్యతను నిర్వర్తించానని, ఈరోజు నుంచి నా కూతుర్ని నీకు అప్పగిస్తున్నానని తండ్రి తన కూతురి బాధ్యతను వరుడికి అప్పగిస్తాడు. దీంతో వరుడు వధువు చేయి పట్టుకొని జీవితాంతం ఆమె బాధ్యతను చక్కగా నెరవేరుస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ ఆచారాన్ని కుమార్తె మార్పిడి అంటారు. అంతేకానీ తండ్రి తన కుమార్తెను వరుడికి దానం చేశాడని అర్థం కాదు. ఈ విధంగా ఒక తండ్రి తన కుమార్తె బాధ్యతను పెళ్లికొడుకుకి అప్పగిస్తాడు మరియు వరుడు ఆ బాధ్యతలను స్వీకరించాలని శ్రీకృష్ణుడు వివరించాడు.