‎Jabardasth Naresh: ఒక ఇంటివాడు కాబోతున్న జబర్దస్త్ నరేష్.. పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరో తెలుసా?

‎Jabardasth Naresh: తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పొట్టి నరేష్ అంటే చాలు చిన్నపిల్లలు సైతం గుర్తుపట్టేస్తారు. తెలుగులో శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, అలాగే పండుగ ఈవెంట్ లు చేస్తూ, తనదైన శైలిలో కామెడీ చేస్తూ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే త్వరలోనే నరేష్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడట. వధువును కూడా పరిచయం చేసేశాడు నరేష్. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‎ఆ వీడియోలో ఈసారి పెళ్లి చూపుల వ్యవహారం సెట్ అయింది. ఈ సారి వరుడు జబర్దస్త్ కమెడియన్ నరేష్ అంటూ స్టేజ్ పై హైపర్ ఆది ఎనౌన్స్‌మెంట్ చేసాడు. మా అందరికీ ఒక ఫ్యామిలీ నుంచి మెసేజ్ వచ్చింది. నరేష్‌ ను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాళ్లు కూడా ఇక్కడికే వచ్చారు! అని ఆది చెప్పడంతో స్టేజ్ ఒక్కసారిగా ఉత్సాహంగా మారిపోయింది. ఆ తర్వాత అమ్మాయిని స్టేజ్ మీదకు తీసుకొచ్చి, లైవ్ పెళ్లి చూపులు మొదలు పెట్టారు. నవ్య నరేష్.. పేర్లు కలుస్తున్నాయి అంటూ ఆది నవ్వులు పూయించాడు.

Sridevi Drama Company Latest Promo | 19th October 2025 | Rashmi, Indraja, Hyper Aadi | MallemalaTv
‎ఆ సమయంలో ఆ అమ్మాయి నరేష్ వైపు తిరిగి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చా. లవ్ యూ లవ్ యూ ఫరెవర్ అంటూ స్టేజ్ మీద ప్రపోజ్ చేసింది. సిగ్గుతో తల వంచిన నరేష్ కూడా తడుముకోకుండా నాకు కూడా మీరు బాగా నచ్చారు అని సమాధానం ఇచ్చాడు. అంతలోనే ఏమ్మా! నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి వెళ్తావా? అని అన్నపూర్ణమ్మ సరదాగా అడిగింది. దానికి ఆ అమ్మాయి నవ్వుతూ నరేష్‌ కి ఏది ఇష్టమైతే, అదే నాకూ ఇష్టం అంటూ సిగ్గు పడుతూ బదులిచ్చింది. అయితే ఇంత కేవలం ఉత్తుత్తి పెళ్లి. ఈ సరదా పెళ్లి వాతావరణంలో నరేష్ తండ్రి కాస్త ఎమోషనల్ అయ్యారు. నా కొడుక్కి పెళ్లి అవుతుందో లేదో అనుకునే వాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సీన్ చూసి నాకు నిజంగా ఆనందంగా ఉంది అని చెప్పడంతో స్టేజ్‌ ఎమోషనల్‌ మోడ్‌ లోకి వెళ్లింది. అయితే ఇది కేవలం షోకోసమే మాత్రమే అని తెలుస్తోంది. మరి నిజంగానే రియల్ లైఫ్ లో నరేష్ ఎప్పుడు ఒక ఇంటి వాడు అవుతాడో చూడాలి మరీ.