Madhu Priya: టాలీవుడ్ సింగర్ మధుప్రియ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో మంచి మంచి పాటలను పాడి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది మధుప్రియ. ముఖ్యంగా పల్లెటూరి పాటలు జానపద పాటలు ఎక్కువగా పాడి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సింగర్ మధుప్రియ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలైన విషయం తెలిసిందే. మధుప్రియ చెల్లి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.
అందులో చాలా సంతోషంగా కనిపించడంతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి స్టెప్పులు కూడా వేసింది. అయితే తాజాగా మధుప్రియ చెల్లెలు శృతి ప్రియ పెళ్లి వేడుకలు ముగిసాయి. శృతి ప్రియ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది మధుప్రియ. తన చెల్లి పెళ్లిలో ఫుల్ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేసింది సింగర్. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
https://www.instagram.com/reel/DM-7yg1hAtY/?utm_source=ig_web_copy_link
ఇకపోతే సింగర్ మధుప్రియ విషయానికి వస్తే ఆమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పాట ఆడపిల్లనమ్మా అనే సాంగ్. పదేళ్ల వయసులోనే ఒక స్టేజీ షోలో ఆడపిల్లనమ్మా అంటూ పాట పాడి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది. తర్వాత 2011లో దగ్గరగా దూరంగా సినిమాలో పెద్దపులి అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష‍్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా లాంటి ఎన్నో సినిమాల్లో పాటలు పాడి అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సింగర్ గా పాటలు పాడుతూనే అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ఉంటుంది.
