Avika Gor: అవికా గోర్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సీరియల్ చిన్నారి పెళ్లికూతురు. ఈ ఒక్క సీరియల్ తో భారీగా ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అదే గుర్తింపుతో సినిమాలలో కూడా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా మొదట హీరో రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో ఉమా పాత్రలో కనిపించిన ఆమె తెలుగు ఆడియన్స్ తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఆ తరువాత కూడా తెలుగులో చాలా సినిమాలు చేసింది.
కానీ అవేవి కూడా ఆమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. తరువాత బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇదిలా ఉంటే, అవికా గోర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందట. 2025 జూన్ లో అవికా గోర్ ఎంగేజ్మెంట్ మిలింద్ చంద్వానీతో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లి డేట్ ను కన్ఫర్మ్ చేసింది అవికా గోర్. వీరిద్దరూ సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నారట. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా సామాజిక కార్యకర్త అయిన మిలింద్ చంద్వానీతో 2020 నుంచి డేటింగ్ లో ఉన్న అవికా త్వరలోనే అతన్ని వివాహం చేసుకోబోతోంది. 2019లో ఒక ప్రోగ్రామ్ లో భాగంగా మిలింద్ ను కలిసింది అవికా. ఆ పరిచయం కాస్త కొంతకాలానికి స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారిందట. అలా దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట పెద్దలకు తమ విషయాన్ని చెప్పగా వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారట. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట.
Avika Gor: పెళ్లి పీటలెక్కబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. డేట్ ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా?
