నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన బార్క్.. 4374 ఉద్యోగాలతో?

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 4,374 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ట్రైనింగ్ స్కీంతో పాటు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మే నెల 22వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 21,700 రూపాయల నుంచి 56,100 రూపాయల వరకు వేతనం లభించనుంది.

 

ఉద్యోగ ఖాళీలను బట్టి వయస్సులో తేడాలు ఉంటాయి. ఒక్కో ఉద్యోగ ఖాళీకి దరఖాస్తు ఫీజు ఒక్కో విధంగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.

 

ఏపీలో వైజాగ్, విజయవాడ, అమరావతి, గుంటూరు పరీక్ష కేంద్రాలుగా ఉండగా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్ పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయని తెలుస్తోంది. మెరిట్ సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు మెరిట్ సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.

 

వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అర్హత, ఆసక్తి ఆధారంగా ఉద్యోగాలను ఎంపిక చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.