టాలెంటెడ్ ఉంటే లేడీ నటుల్లో కేవలం గ్లామరస్ పాత్రలే కాకుండా సాలీడ్ నెగిటివ్ రోల్స్ కూడా నటించి మెప్పించవచ్చు అని ఇది వరకు కొందరు సీనియర్ నటులు చూపించారు. కానీ ప్రస్తుత జెనరేషన్ లో అయితే అపారమైన టాలెంట్ ఉన్న వెర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ కాస్త స్పెషల్ అనే చెప్పాలి.
ఈమె హీరోయిన్ గా కాకుండా ఏజ్ చిన్నదే అయినా కూడా పవర్ ఫుల్ నెగిటివ్ రోల్స్ చేసి అదరగొడుతుంది. అప్పటికే చాలా సినిమాలతో మన తెలుగులో తెలుసు కానీ మాస్ మహారాజ రవితేజ భారీ హిట్ “క్రాక్” తో అయితే తెలుగు ఆడియెన్స్ లో జయమ్మ గా ఒక మార్క్ ని సెట్ చేసుకుంది.
అయితే ఈమె లుక్ పరంగా కాస్త బొద్దు గానే ఉంటుందని తెలిసిందే. కానీ లేటెస్ట్ గా మాత్రం ఆమె తన బాడీ ని కంప్లీట్ గా చేంజ్ చేసేసుకొని అందరికీ షాకిచ్చింది. తన చబ్బీ లుక్ నుంచి చాలా నాజూగ్గా స్లిమ్ లుక్ లోకి మారిపోవడం సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.
అయితే తాను ఏదన్నా సినిమా కోసం ఇలా మారిందా లేక కావాలనే తనని పర్సనల్ గా మార్చుకుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది కానీ తన లేటెస్ట్ గ్లామర్ లుక్ మాత్రం అందరి మతి పోగొడుతుంది. మరి ఈమె అయితే ఇప్పుడు బాలయ్యతో తన 107వ సినిమాలో నటిస్తుంది. అలాగే మరిన్ని తమిళ్ తెలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది.
#transformation can happen at anytime to anyone..believe in yourself.. don’t let anyone tell you what u can and cannot do..confidence is your best weapon.. challenge yourself.. you are the best competition for yourself.. you will be surprised how much you can achieve.. #believe pic.twitter.com/RzqEyR8e98
— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) August 22, 2022