Curd: చలికాలం ఆరోగ్యానికి మంచిది కాదని పెరుగు పక్కన పెడుతున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే!

Curd: చలికాలం రావడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతాయి. ఇలా ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల చాలామంది జలుబు ,దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు గురి అవుతూ ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడినవారు చాలా కాలం పాటు ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఇలా చలికాలంలో ఇలాంటి వ్యాధులకు గురి కాకుండా ఉండటం కోసం చాలామంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అలాంటి వాటిలో చాలామంది భోజనం చేసేటప్పుడు పెరుగును కూడా తినకుండా ఉంటారు.

ఇలా పెరుగు తినకపోవడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు అని భావిస్తుంటారు నిజంగానే మీరు ఇలా పెరుగు పక్కన పెట్టారు అంటే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పెరుగులో మన ఆరోగ్యాన్ని పెంపొందింప చేసే ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. అందుకే చలికాలంలో పెరుగును తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ప్రో బయోటిక్స్ మన జీర్ణ వ్యవస్థలో రోగనిరోధక శక్తిని పెంపొందించే కణాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈ విధంగా కణాలు అభివృద్ధి చెందటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉండడంతో ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండడానికి దోహదపడుతుంది.

ఇకపోతే  చలికాలంలో సూర్యుడు పెద్దగా కనిపించరు కనుక మనకు సూర్యరశ్మి నుంచి వెలువడే విటమిన్ డి మన శరీరానికి సరైన మోతాదులో లభించదు. ఇలాంటి తరుణంలోనే మనం పెరుగును తీసుకోవడం వల్ల పెరుగులో ఉన్నటువంటి విటమిన్ డి మన శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. అందుకే కాలం ఏదైనా పెరుగు తప్పనిసరిగా తినాలని చెబుతున్నారు. అయితే చాలామంది ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు మాత్రం రాత్రిపూట పెరుగు తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.