మన దేశంలో షుగర్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఎంత ప్రమాదమో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే అంతకంటే ఎక్కువ ప్రమాదమని చెప్పవచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్లు మరీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకున్నా షుగర్ లెవెల్స్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటున్నా వణుకు, ఆందోళన లాంటి లక్షణాలు కనిపిస్తున్నా తలనొప్పి, తల తిరుగుతున్నట్టు అన్పించినా అవి లో షుగర్ లెవెల్స్ కు సంకేతాలు అని చెప్పవచ్చు.
వయస్సును బట్టి రక్తంలో షుగర్ లెవెల్స్ ఉండాలి. మధుమేహంకు పూర్తిస్థాయిలో నివారణ మందులు లేవు. జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మాత్రమే మధుమేహంకు చెక్ పెట్టవచ్చు. ఒకవేళ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మాత్రం అలసట, టెన్షన్, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, బరువు తగ్గడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం, తరచుగా మూత్రవిసర్జన, ఎక్కువగా దాహం వేయడం, తలనొప్పి లాంటి సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.
షుగర్ లెవెల్స్ హద్దులు దాటితే శరీరంలోని అవయవాల పనితీరు మందగించడంతో పాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ బారిన పడే అవకాశం ఉంటుంది. మధుమేహం వచ్చిన వాళ్లలో 90 శాతం మంది టైప్2 డయాబెటిస్ తో బాధ పడుతున్నారు. కూరగాయలు, పండ్లు, పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్ల సరైన మిశ్రమంతో కూడిన సమతుల్య ఆహారాన్ని డయాబెటిస్ ఉన్నవారు తీసుకుంటే మంచిది.
ఈ విధంగా ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం, డీ హైడ్రేషన్, చిగుళ్ల సమస్యలు సైతం మధుమేహానికి కారణమవుతాయి. ఎండకు ఎక్కువగా ఉండటం, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.