మనలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా వేర్వేరు రకాల వంటకాలను తినడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. అయితే బ్రేక్ ఫాస్ట్ గా ఏమైనా తీసుకోవచ్చు కానీ అన్నం మాత్రం తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అన్నం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. అన్నంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తీసుకుంటే మలబద్ధకం సమస్య సైతం దూరమవుతుందని చెప్పవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్లు పరిమితంగా తీసుకుంటే మంచిది. అన్నం తినడం వల్ల సులువుగానే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పవచ్చు. బీపీని తగ్గించడంలో అన్నం ఎంతగానో ఉపయోగడుతుంది. అయితే అన్నం ఎక్కువగా తినేవాళ్లలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
అన్నం ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం బారిన పడటంతో పాటు కొంతమందిలో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. అన్నం ఎక్కువగా తినేవాళ్లను కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత సమస్యలు సైతం వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. అన్నం ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం అయితే ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు.
ఇప్పటికే షుగర్ సమస్యతో బాధ పడేవాళ్లు అన్నంకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. షుగర్ లెవెల్స్ అన్నం ఎక్కువగా తినడం వల్ల పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం కేర్ లెస్ గా ఉన్నా ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.