కొన్ని అలవాట్లు మెదడుకు హాని కలిగించవచ్చు. ముఖ్యంగా నిద్రలేమి, ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, ధూమపానం మరియు మద్యాన్ని ఎక్కువగా తీసుకోవడం మెదడు పనితీరును దెబ్బ తీసే అవకాశాలు అయితే ఉంటాయి. తగినంత నిద్ర లేకపోవడం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి మెదడు కణాలను దెబ్బతీసి, మానసిక మరియు శారీరక వ్యాధులకు దారితీస్తుంది.
తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, అది పనితీరును తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ధూమపానం మరియు మద్యాన్ని ఎక్కువగా తీసుకోవడం మెదడు కణాలను నాశనం చేయడంతో పాటు జ్ఞాపకశక్తిని తగ్గించే అవకాశాలు ఉంటాయి.
మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి మెదడు పనితీరు మందగించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సూర్యరశ్మి తగినంతగా లేకపోతే, అది మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర కచ్చితంగా ఉంటే ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు. యోగా, ధ్యానం, వ్యాయామం వంటి పద్ధతుల ద్వారా సులువుగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండవు. సూర్యరశ్మిలో ఎక్కువ సమయం ఉండటం ద్వారా కూడా మెదడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.