Raw Onion: గుండె సమస్యలు ఉన్నవారు.. పచ్చి ఉల్లిపాయ తినడం సేఫేనా..?

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచీ పెద్దవారి వరకు గుండె సమస్యలు కామన్ అయిపోయాయి. ఏ వయసులోనైనా హార్ట్‌అటాక్ రావచ్చు, కొలెస్ట్రాల్ పెరగొచ్చు, బీపీ అదుపు తప్పొచ్చు. వీటికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు, జీవన శైలి అని నిపుణులు చెబుతున్నారు. ఎన్ని మందులు వాడినా, జాగ్రత్తలు తీసుకున్నా.. రోజువారీ ఆహారం సరిగ్గా ఉండకపోతే సమస్యలు తగ్గవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లో ఉండే చిట్టి ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుందని మీరు తెలుసా.. పెద్దలు తరచూ చెప్పే “ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు” అన్న మాట వెర్షన్‌లోనే శాస్త్రీయ రీతిలో నిజం అని వైద్యులు కూడా ఒప్పుకుంటున్నారు. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తక్కువ చేస్తుంది. ఫలితంగా గుండె బలంగా తయారవుతుంది. గుండె ఆప్లికేషన్స్, స్ట్రోక్‌కి దూరంగా ఉంచుతుంది.

తాజాగా పచ్చి ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఉన్న చెడు కొవ్వును కరిగిస్తుంది. అందువల్ల హార్ట్ బ్లాక్‌లు, కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయి. గుండెకు సంబంధిత సమస్యలు ఉన్నవారు రోజూ కనీసం కొంచెం పచ్చి ఉల్లిపాయను ఆహారంలో భాగం చేసుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా ఈ ఉల్లిపాయలు మధుమేహంతో ఉన్నవారికి కూడా మంచివి. ఎందుకంటే వీటిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే గుణాలు ఉంటాయి. కాబట్టి షుగర్ నియంత్రణకు ఇవి సహకరిస్తాయి. అలాగే ఉల్లిపాయల్లోని సల్ఫర్, క్వెర్సెటిన్ ఎముకలను బలంగా ఉంచుతాయి. అందువల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

కాబట్టి మీ ఆహారంలో పచ్చి ఉల్లిపాయలు ఉండేలా చూసుకోండి. రైతాలో, సలాడ్‌లో లేదా మాంసాహారంతో దీనిని భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండటానికి గుండె జబ్బులను దూరం చేయడానికి ఇది మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. తెలుగు రాజ్యం దీనిని ధృవీకరించడం లేదు.. ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించండి.)