జ్ఞానేంద్రియాలలో ఒకటైన చెవి మనం వినటానికి సహాయపడుతుంది. చెవిలో ఏదైనా సమస్య ఏర్పడితే తీవ్ర సహనానికి గురవుతాం. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే వ్యాధినిరోశక్తి తక్కువ ఉన్న వారిలో చెవి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అధిక వర్షాల కారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన చెవిపై తీవ్ర ప్రభావం చూపి చెవిపోటు, వినికిడి తగ్గడం, చెవిలో చీము కారడం , దురద వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.
చెవి సమస్యలకు దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, టిబి వంటివి కూడా కారణం కావచ్చు. ఇలాంటివారు వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం.వర్షకాలంలో వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణమే. అయితే వైరల్ ఇన్ఫెక్షన్లతో ప్రమాదం ఏమీ ఉండదు వాటంతకుడవే తగ్గిపోతాయి.
బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మాత్రం చికిత్స తప్పనిసరి లేకుంటే భవిష్యత్తులో చెవి సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.
వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని జలుబు సమస్య వేధిస్తుంది. దాంతోపాటే చెవిలో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్‌కు అవకాశం ఎక్కువగా ఉంటుంది.ముక్కునుంచి చెవికి యుస్టేషన్ ట్యూబ్స్ అనే రెండు గొట్టాలు అనుసంధానమై ఉంటాయి. జలుబు చేసినప్పుడు ముక్కు వెనుక ఉన్న యుస్టేషన్ ట్యూబ్ గుండా ఇన్‌ఫెక్షన్ మధ్యచెవికి విస్తరిస్తుంది. దీనివల్ల చెవిలో చీము చేరి మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. సరిగ్గా వినిపించదు. నొప్పి ఉంటుంది.
వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటించాలి.
వర్షంలో తడిచినప్పుడు చెవిలో నీరు చేరి
అస్పర్‌జిల్లస్ నైగర్,కాండిడా అల్బిక్యాన్ అనే ఫంగస్ చేరి ఇన్ఫెక్షన్స్ ఏర్పడతాయి. ఇది చాలా ప్రమాదకరమైనవి సరైన సమయంలో చికిత్స చేయించుకోకుంటే వినికిడి శక్తి తగ్గి అనేక చెవి సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.చెవిలో నీరు చేరకుండా జాగ్రత పడాలి ముఖ్యంగా వర్షాకాలంలో.చలికాలంలో చెవులు కప్పి ఉంచేలా మంకీ క్యాప్, మఫ్లర్ వంటివి ధరించాలి. కాటన్ బెడ్స్ చీటికిమాటికి ఉపయోగించకూడదు. చెవి నొప్పి వస్తే సొంత వైద్యం చేసుకోవడం ప్రమాదకరం. తప్పనిసరిగా చెవి వైద్య నిపుణులని సంప్రదించాలి.